
కన్యా సంక్రమణం ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా.. ఈ నెల 17న అంటే రేపే కన్యాసంక్రమణం. ఈ రోజున నదీ స్నానమాచరిస్తే ఫలితం ెలా ఉంటుందనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సూర్యుని ఆరాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. కన్యా సంక్రమణం రోజు ముందుగా ఒక రాగి పాత్రలో నిండుగా నీరు తీసుకోవాలి. అందులో సూర్యునికి ఇష్టమైన ఎర్రని పువ్వులు, అక్షింతలు వేసి ఆదిత్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత 12 సార్లు సూర్య నమస్కారాలు చేసి.. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. అనంతరం సూర్యుడికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.
ఇక కన్యా సంక్రమణం విశిష్టత గురించి తెలుసుకుందాం. కన్యా సంక్రమణం అంటే సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించడమేనని తెలుసుకున్నాం కదా. ఇది ఎంతో విశిష్టమైనది. సనాతన ధర్మం ప్రకారం కన్యా సంక్రమణానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున దానధర్మాల ప్రాధాన్యత తెలుసుకున్నాం కదా.. అలాగే జపం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందట. ఇవన్నీ చేస్తే ఉద్యోగ ప్రయత్నాలన్నింటితో పాటు.. ఇతర విషయాల్లోనూ విజయం సాధిస్తారని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని ఎలా పూజించాలో కూడా తెలుసుకున్నాం కదా.. దీని వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెబుతారు.
