ఏకముఖి రుద్రాక్షలను గుర్తించడమెలా?

ప్రస్తుత కాలంలో రుద్రాక్షలకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. దీనిని ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో ఎన్నో నకిలీ రుద్రాక్షలు దర్శనమిస్తున్నాయి. అయితే ఏకముఖి రుద్రాక్ష విషయంలో ముఖ్యంగా మోసపోయే అవకాశం ఎక్కువ. ఒకవేళ మీరు ఎవరైనా ఏకముఖి రుద్రాక్షను ధరించాలని అనుకుంటే.. ముందుగా అది అసలైందో కాదో పరీక్షించుకోవాలి. ఆ తరువాత అసలు దానిని ధరించవచ్చా లేదా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రుద్రాక్షలు అందరూ ధరించడం మంచిది కాదు. అసలు ఈ ఏకముఖి రుద్రాక్ష ఏ రాశి వారికి ఇది ఎక్కువ ప్రయోజనకరం? ఆరోగ్య పరంగా దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

ఏకముఖి రుద్రాక్ష అనేది మోక్ష ప్రాప్తికి ఉత్తమ సాధనంగా చెబుతారు. అలాగే దీనిని ధరించిన వారు భగవంతుడికి చేరువవుతారు. ఈ రుద్రాక్షను జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అయితే సూర్యుడితో సంబంధం కలిగిన వారు దీనిని ధరించవచ్చు. ఎవరి జాతకంలో అయినా సూర్యుడు బలహీనంగా ఉంటే దీనిని ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. సింహరాశి వారు దీనిని ధరించడం చాలా మంచిదట. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలున్న వారికి ఇది మేలు చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందట. విద్యార్థులు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుందట. అయితే అసలైన రుద్రాక్షను గుర్తించేందుకు ఆముదంలో రుద్రాక్షను వేస్తే ఉన్న రంగు కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. రుద్రాక్షను నీటిలో వేసి మరిగిస్తే రంగుపోతే అది నకిలీదని అర్థం. ఏకముఖి రుద్రాక్షలో ఒక సహజ సిద్ధమైన ధార అంటే లైన్ ఉంటుంది.

Share this post with your friends