సాల గ్రామాలు ఎలా పుడతాయి?

సాలగ్రామాల గురించి ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సాలగ్రామాల్లో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని చెప్పుకున్నాం కదా. అందుకే సాలగ్రామం ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానమని చెబుతారు. అసలు సాలగ్రామాన్ని దర్శించుకున్నా.. లేదంటే స్పృశించినా, అర్చన చేసినా కూడా ఊహించనంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఇక ఇప్పుడు ఈ సాలగ్రామాలు ఎలా పుడతాయి? ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందాం. సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయంటే నేపాల్ దేశంలోని ఖాట్మండ్‌కు సుమారు 197 మైళ్లు దూరంలో లభిస్తాయట.

ఖాట్మండ్‌కు సుమారు 197 మైళ్లు దూరంలో ముక్తినాధ్, గండకీ తీరాన్ని ఆనుకుని సాలగ్రామ గిరి ఉంటుందట. దీనిపై గండకీ నదీ ప్రవహిస్తూ ఉంటుంది. దీని గర్భంలో సాలగ్రామాలు లభిస్తాయట. ఈ సాలగ్రామ శిలలను ఒక రకమైన ప్రాణి నిర్మిస్తుందని చెబుతారు. ‘ఆలి’ అనే మత్స్యం నుంచి ఈ సాలగ్రామాలు వస్తాయి. అదెలాగో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. శీతాకాలంలో ఆలి అనే మత్స్యం తన శరీరం నుంచి వెలువడే ఒక రసాయనిక పదార్థంతో శిలలాంటి కవచాన్ని నిర్మించుకుంటుంది. ఆ మత్స్యం మరణించినప్పుడు కానీ లేదంటే దానిని వదిలి వెళ్ళినప్పుడు కానీ అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయి.

Share this post with your friends