
రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకుంటాం? ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోబోతున్నాం? ఈ పండుగను ఏ ఏ మతాల వారు జరుపుకుంటారో కూడా తెలుసుకున్నాం కదా. అసలు హిందువులు ఈ పండుగను జరుపుకోవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో చేస్తున్న సమయంలో ఆయన భార్య శచీ దేవి తన భర్త రక్షణ కోరుతూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లిందట. శ్రీకృష్ణ పరమాత్ముడిని సోదరుడిగా భావించి ఆయన చేతికి ఆమె ఒక దారం కట్టి తన భర్తని రక్షించమని వేడుకుందట..
అప్పటి నుంచి రాఖీ కట్టడం ఒక ఆచారంగా మారిందని చెబుతారు. అందువల్ల హిందూ మతంలో రక్షా బంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టడం సంప్రదాయంగా వస్తోంది. జైనులు ఎందుకు రాఖీ కట్టుకుంటారో కూడా తెలుసుకున్నాం కదా. ముస్లిం , క్రైస్తవ మతాలకు చెందిన వారు సైతం ఈ ఒక్క పండుగ విషయంలో అందరితో కలిసి పండుగను జరుపుకుంటారు. తమ సోదరుడికి రాఖీ కట్టి ఆనందంగా ఆరోజును జరుపుకుంటారు. కులమతాలను పక్కన బెట్టి జరుపుకునే పండుగ కావడంతో దీనిని మన దేశ ఐక్యతకు చిహ్నంగా పరిగణిస్తారు.
