అతల, వితల, సుతల లోకాల గురించి తెలుసా?

పాతాళ లోకం లేదంటే పాతాళం అనే మాట తరచూ వింటూనే ఉంటాం. ఇవన్నీ భూమి కింద ఉంటాయని చెబుతారు. ఒకటి కాదు.. ఏడు లోకాల శ్రేణిని పాతాళ లోకంగా పిలుస్తారు. ఈ ఏడు లోకాలు ఏడు విధాలుగా ఉంటాయి. ఈ లోకాలను ఆనంద ప్రదేశాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ నివసించే జీవులు వారి కర్మ ఆధారంగా నివసిస్తూ ఉంటారు. ఈ ఏడు లోకాల్లో మూడు లోకాల గురించి ముందుగా తెలుసుకుందాం.

అతల-లోకం: భూలోకం తర్వాత ఉన్న లోకం, అలాగే అన్ని లోకాల్లో 8వ లోకం అతల లోకం. ఈ అతల లోకంలో దైత్యులు, దానవులు, నాగులు అంతా తమ భార్యలతో సంతోషంగా నివసిస్తున్నారు. అంతేకాకుండా మాయ కుమారుడు బాలా సామ్రాజ్యమంతా ఇక్కడ విస్తరించి ఉందని చెబుతారు. ఇక ఈ అతల లోకంలో మాయ శక్తులతో సృష్టించబడిన రాజభవనాలు, వైభవ ప్రదేశాలు ఉంటాయని చెబుతారు.

వితల-లోకం: ఇది భూమి తర్వాత రెండవ లోకం.. అన్నింటిలో 9వ లోకం. వైశ్యుల జన్మస్థలం ఇదేనని చెబుతారు. అలాగే ఇందిరాదేవి (సంపద దేవత) ఇక్కడే నివసిస్తుందట. మంచి ఆత్మలు, రాక్షస ఆత్మలు రెండూ ఇక్కడ నివసిస్తాయని చెబుతారు.

సుతల-లోకం: ఇది భూమి తర్వాత 3వ లోకం.. అన్నింటిలో 10వ లోకం. బలి తలపై వామనుడు తన పాదం ఉంచి అతన్ని పాతాళానికి తొక్కేసిన తర్వాత ఆయన ఇక్కడే నివసిస్తున్నాడని చెబుతారు.

Share this post with your friends