కృష్ణ కమలం గురించి మీకు తెలుసా?

కృష్ణ కమలం మొక్క గురించి మీకు తెలిసిందే కదా. అది కేవలం ఒక పువ్వు కాదు. కృష్ణ కమలాన్ని శ్రీ కృష్ణుడి చిహ్నంగానూ.. మహాభారతాన్ని మొత్తం ఈ ఒక్క పువ్వు ద్వారానే తెలుసుకోవచ్చని చెబుతారు. త్వరలోనే జన్మాష్టమి రాబోతోంది. ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ రోజున పూజలో తులసి దళాలతో పాటు కృష్ణ కమలాన్ని చేరిస్తే మీరు నిజంగా శ్రీ కృష్ణుడిని ఇంటికి ఆహ్వానించినట్టే అవుతుంది. ఈ మొక్క ఎక్కడుంటే అక్కడ కన్నయ్య ఉంటాడని చెబుతారు. ఈ కృష్ణ కమలంలో మహాభారతం నుంచి విశ్వ సృష్టి వరకూ దైవిక సంకేతాలుంటాయని చెబుతారు.

కొందరు శ్రీకృష్ణ జన్మాష్టమికి ముందు తమ ఇంట కృష్ణ కమలం మొక్కను నాటుతారు. ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట ఉంటే ఆనందం, అదృష్టాన్ని ఇస్తుందట. ఇదొక తీగ మొక్క. కృష్ణ కమలం సాంకేతిక నామం.. పాసిఫ్లోరా ఇన్కార్నాట. ఇదొక తీగ మొక్క. ప్రత్యేక నిర్మాణంతో అందంగా కనిపించే మొక్క ఇది. ఈ మొక్క నీలం-ఊదా రంగుల కలయికతో ఉండే అందమైన పువ్వులను ఇస్తుంది. ఈ మొక్కలో ఉన్న ప్రతి పొర, ప్రతి రేక కేవలం ఒక పువ్వు మాత్రమే కాదు.. శ్రీ కృష్ణుడి పాత్ర, ఆయన అవతారాలు, విశ్వ సృష్టి రహస్యానికి చిహ్నం అని నమ్ముతారు.

Share this post with your friends