
ధృతరాష్ట్ర పెంపకం: దృతరాష్ట్రుడికి తన పిల్లలంటే ఎంతో ఇష్టం. ఇది సహజమే ప్రతి తండ్రికి అలాగే ఉండాలి. కానీ, తప్పులు చేస్తున్న పిల్లలని కూడా వెనకేసుకురావడం వారు చేసిన, ‘చెడ్డ పనులు’ అన్యాయాలు, మోసాలు, కూడా సమర్ధించటం తన పదవిని అడ్డం పెట్టుకొని కాపాడటం మంచిది కాదు. చివరిలో ధృతరాష్ట్రుడు కొడుకులు “దుర్యోధనుడు’- “దుశ్శాసుడు’ లాంటివారు హతమయ్యాక చింతించాడు. నేడు సమాజంలో పెద్దపెద్ద ఉద్యోగాలలో ఉన్నవారు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు, తమ పిల్లల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వారు ఏది అడిగితే అది ఇవ్వటం! ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వటం! కార్లు, సెల్ ఫోన్లు, విరివిగా ఇవ్వటం, చివరకు తప్పు చేస్తున్నా చూసి వారించలేకపోవటం ‘ద్రౌపతి మానభంగం’ సమయంలో వారించలేకపోయిన దృతరాష్ట్రుడిలాగా ప్రవర్తించడం వల్ల చివరకు చిక్కులు తప్పవు.
కర్ణ పెంపకం: కర్ణుడు మహావీరుడు తను నమ్మిన వారి కోసం తోబుట్టులను సైతం కాదన్న మహా ‘దానశీలి, ఎవరేది అడిగినా! మారు మాట లేకుండా ఇచ్చేవాడు. కొందరు ఇంట్లో వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వారు పట్టించుకోరు. పక్కింటి వారింట్లో పళ్ళపొడి అయిపోయిందంటే? పరిగెత్తికెళ్ళి తెచ్చిస్తారు. అలాగని ఇంట్లో వారి మీద ప్రేమ లేదని చెప్పలే! కానీ అది పట్టించుకోరు. ఇంట్లో వారి చదువు కోసం లేదా మరో సహాయం కావాలన్నా! ఎవరిని అడగరు, అడగలేరు. అది ఏదో ‘త్యాగం’ ‘దేశభక్తి’ అనుకుంటారు. వీరి పిల్లలు సమాజం పై “ద్వేషం పెంచుకుంటారు”. వీరికి ఎవరితోనూ సత్సంబంధాలు ఉండవు. తమ జీవితమేమో తామే చూసుకుంటారు.
