ఈ అమ్మవారికి భక్తులు తమ కోరిక తీరితే కానుకగా బంగారం, వజ్రాలు

దేవీ వరన్నవరాత్రి ఉత్సవాలను దేశమంతా అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. వినాయక మండపాల స్థాయిలో లేకున్నా కూడా అనేక ప్రాంతాల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రి వేడుకలు చాలా ప్రత్యేకం. ఇలాంటి ప్రదేశాల్లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఒకటి.

ఇక్కడ దుర్గాదేవిని నగర్ సేథాని మాతగా పిలుస్తారు. నగర్ సేథాని మాతకు అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఏ పూలతోనో మరో రకంగానో అలంకరించారు. బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు , మాణిక్యాలతో చేసిన విలువైన ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు.

ఈ ఆభరణాలన్నింటి నడుమ అమ్మవారు దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడే కాదు.. గత 157 ఏళ్లుగా ఇక్కడ అమ్మవారికి బంగారం, వెండి , వజ్రాల ఆభరణాలను సమర్పించడం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా.. దుర్గమ్మ పూజ విషయంలో తొలి స్థానంలో ఉంటుంది. కోల్‌కతా తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు నగరం మొత్తం అమ్మవారి మండపాలతో నిండిపోతుంది. నగర్ సేథాని మాతను సైతం భక్తులు అత్యంత భక్తి , శ్రద్ధలతో పూజించుకుంటారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు అమ్మవారికి బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలను కానుకగా సమర్పిస్తారు. ఇలా పెద్ద ఎత్తున అమ్మవారికి వెండి, బంగారం, వజ్రాలు, ముత్యాలు వస్తుంటాయి. ఈక్రమంలోనే అమ్మవారిని ఆభరణాలతో అలంకరిస్తారు.

Share this post with your friends