శివ భక్తుడిని బంధించిన దారుక దంపతులు.. తర్వాతేం జరిగిందంటే..

పార్వతీ మాత వరంతో దారుక దంపతులు మానవులు, దేవతలన్న తేడా లేకుండా అందరినీ హింసించనారంభించారు. అప్పుడు ఔర్వుడు యజ్ఞం చేసి దాని నుంచి అమృతాన్ని సృష్టించి దేవతలకు ఇవ్వగా అది తాగిన దేవతలు.. రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించారు. అప్పుడు రాక్షసులంతా పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపానికి పారిపోయి అక్కడ కూడా అటుగా వచ్చే జనాలను భక్షించేవారు. ఆ సమయంలో సుప్రియుడు అనే ఒక శివ భక్తుడుండేవాడు. అతను వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. దీనికోసం తరచుగా ఓడల్లో సరుకులు నింపుకుని వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు.

Daruka Couple Captured Shiva Devotee
Daruka Couple Captured Shiva Devotee

అలా ప్రయాణిస్తూ ఒకరోజు సుప్రియుడు పశ్చిమ సముద్రంలోని రాక్షస సైన్యం జీవిస్తున్న ద్వీపం వద్దకు చేరుకున్నాడు. అక్కడకు రాగానే రాక్షస సైన్యం సుప్రియుడితో పాటు అతని అనుచరులను తీసుకెళ్లి తమ చెరసాలలో బంధించారు. అక్కడి నుంచి సుప్రియుడితో ఉన్న వారందరినీ రోజుకొకరిని చొప్పున రాక్షసులు భక్షించడం ఆరంభించారు. భయపడిపోయిన సుప్రియుడు రక్షించమని శివుడిని వేడుకున్నాడు. అతను తన భార్యతో కలిసి తమను బంధించిన ప్రాంతంలోనే శివుడి సైకత లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయసాగారు. దీంతో విషయం శివుడికి తెలిసింది. దారుక దంపతులు ఎంతో మందిని హింసించి భక్షించారని.. చివరకు పరమ పుణ్యాత్ముడైన సుప్రియుడిని కూడా బంధించి చంపడానికి యత్నించారని తెలియడంతో వారిని కాపాడటం సరికాదు కాబట్టి ప్రజలకు వీరి బాధను తొలగించమని పార్వతీదేవిని కోరాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends