Changes In Medaram : మేడారం…నాటికి నేటికి మార్పులు ఇవే

మేడారం జాతర అంటే ఒక పండుగ కాదు… అది ఆదివాసీ ఆత్మగౌరవానికి, భక్తి పరాకాష్ఠకు ప్రతీక. నిన్నటిదాకా అడవుల్లో, గూడేల మధ్య జరిగిన ఈ జాతర నేడు ప్రపంచమే చూసే మహోత్సవంగా మారింది. కానీ మేడారం జాతర విధానం మాత్రం మారలేదు.. విగ్రహాలు లేని దేవాలయం, ఆగమ శాస్త్రం లేని పూజ, అడవే ఆలయం, కుంకుమ భరిణలే దేవతలు. సమ్మక్క,సారలమ్మలను కొంగు బంగారంలా గద్దెలపై దర్శించుకునే అరుదైన సంప్రదాయం ఇది. ఒకప్పుడు కష్టసాధ్యమైన ప్రయాణం, నేడు సౌకర్యాల మధ్య జరుగుతున్నా… భక్తుల మనసుల్లో అదే భక్తి, అదే నమ్మకం. వంద రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మేడారానికి కొత్త రూపం ఇచ్చినా, ఆ దేవతల మహిమ, అడవి గాలి తెచ్చే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం నాటిదే. మేడారం మారింది… కానీ మేడారం దేవతలు మారలేదు.

Changes In Medaram
Changes In Medaram
Share this post with your friends