బ్రిటీష్ కాలం నాటి అద్భుతమైన నాడీ గణపతి ఆలయం.. ఎక్కడుందంటే..

హిందువులంతా తొలి పూజ విఘ్నేశ్వరుడికే చేస్తారు. అలాగే ఏ శుభకార్యం లేదంటే వేరే ఏదైనా పనిని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడికే తొలి పూజ చేస్తాం. వినాయకుని పూజించకుండా చేసిన ఏ పనులు విజయవంతం కావని హిందువులంతా నమ్ముతారు. మన దేశంలో ప్రతి గ్రామంలోనూ గణపతి ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఆలయం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఉంటుంది. అలాంటి అద్భుత ఆలయమే కాకుండా.. అరుదైన ఓ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇంతకూ ఈ అరుదైన గణపతి ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

బ్రిటీష్ కాలం నాటి అద్భుతమైన నాడీ గణపతి ఆలయం.. ఎక్కడుందంటే..
బ్రిటీష్ కాలం నాటి అద్భుతమైన నాడీ గణపతి ఆలయం.. ఎక్కడుందంటే..

తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళంలో చిత్రావతి జలపాతం ఉంటుంది. అక్కడ వెలిసిన గణపతిని నాడీ గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని బ్రిటీష్ వారి కాలంలో నిర్మించారు. ఈ గణపతి ఆలయంలో మూలవరుల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సమయంలో అప్పటి గవర్నర్ ఆలయానికి వచ్చాడట. రాతికి ప్రాణం ఉంటుందా? అని అవహేళన చేశాడట. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక సిద్ధ యోగి ఈ విగ్రహానికి ప్రాణం ఉందన్న విషయాన్ని రుజువు చేశాడట. దీంతో ఆ గవర్నర్ స్వయంగా వచ్చి స్వామివారికి నమస్కరించాడని చెబుతారు. ఇక్కడ మౌన స్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం వంటివి కూడా ఉన్నాయి.

Share this post with your friends