✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 8వ రోజు (08-11-2025) – కార్తిక శనివారం (సంకష్టహర చతుర్థి) కార్యక్రమాలు ✪

* తండ్రీ తనయులు కొలువై ఉన్న కోటి దీపోత్సవ ప్రాంగణంలో పవిత్రమైన ప్రదోషకాల అభిషేకం
* సంపద, ఐశ్వర్యం అనుగ్రహించే రజత గోమాత పూజ
* కోటి దీపోత్సవం ఎనిమిదో రోజున బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారి ప్రవచనామృతం

* భక్తులే ఆచరించి తరించేలా కాజీపేట శ్వేతార్క మహాగణపతికి కోటి గరికార్చన

* కోరిన కోరికలు నెరవేర్చే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం

శ్రీ రాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం* గత జన్మల పాపాలు హరించే ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి
* మహా కోటి లింగేశ్వరుడికి శత అష్టోత్తర పంచ హారతులు
* వైశ్య కుల గురువులు హల్దీపురం పీఠాధిపతి పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* సంకష్టహర చతుర్థి వేళ కోడెమొక్కులవాడి సన్నిధిలో “తొలి కార్తిక దీపారాధన”
* కోటి దీపోత్సవంలో స్వర్ణ లింగోద్భవ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు
* గత జన్మల పాపాలు కోటి దీపోత్సవ సప్త హారతులు చూసిన వెంటనే భస్మమైపోతాయి
* పరమ పవిత్రమైన కార్తికమాసంలో కోటి లింగేశ్వరుడికి “మహా నీరాజనం”
* వైశ్య కుల గురువులు హల్దీపురం పీఠాధిపతి పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వారికి గురు వందనం
* ఆత్మీయ సత్కారం
* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)
* మహా మంగళ హారతి
