ఈ దుర్గమ్మ అవతారమైన ఇడాన్ మాత గురించి తెలిస్తే షాకవుతారు..

మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వెయ్యేళ్లకు పైగా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మానవ మేథస్సుకి అందని రహస్యాలను దాచుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు సమీపంలో ఉంది. ఈ ఆలయం దుర్గాదేవి అవతారమైన ఇడాన మాత దేవాలయం. ఈ ఆలయం వెయ్యేళ్లకు పూర్వం నాటినదని చెబుతారు. అమ్మవారు దుష్ట శిక్షణ కోసం స్వయంభువుగా వెలిసిందని చెబుతారు. ఈ ఆలయంలో ఎవరి ఊహకూ అందనిది ఒకటి జరుగుతుంది. అదేంటంటే.. అమ్మవారు అగ్ని స్నానం చేస్తుంది.

ఈ అద్భుతంతోనే భారతదేశంలోని శక్తి పీఠాలలో ప్రత్యేకమైదిగానూ.. సైన్స్‌కే పెను సవాల్‌గానూ ఈ ఆలయం నిలిచింది. దేవత అగ్ని స్నానం చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకున్నవారందరి దుఃఖాలు తొలగి.. అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారట. ఈ ఆలయం ఉదయపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఉంది. మేవార్ శక్తి పీఠంగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఇక్కడ అమ్మవారు స్వయంగా అగ్నిలో స్నానం చేస్తూ ఉంఉంది. అసలు ఎప్పుడు మంటలు చెలరేగుతాయో కూడా తెలియదట. అకస్మాత్తుగా 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ మంటలు ఎగిసి పడతాయట.

Share this post with your friends