శ్రావణమాసంలో ఆకుపచ్చ దుస్తులు, గాజులు ఎందుకు ధరిస్తారు?

శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇప్పటికే ఒక శ్రావణ శుక్రవారాన్ని సైతం జరుపుకున్నాం. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా విశేషమైన మాసం. శివకేశవులతో పాటు వరలక్ష్మీ, మంగళ గౌరీలను ఈ నెలలో పుజిస్తారు. తద్వారా అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులను అందుకుంటారు. ముఖ్యంగా శ్రావణమాసమంతా మాంసాహారం స్వీకరించరు. అలాగే సోమవారం, మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు ఉంటారు. అయితే శ్రావణ మాసంలో కొన్ని సంప్రదాయాలను అనుసరిస్తారు. సంప్రదాయాల ప్రకారం.. స్త్రీలు ఆకుపచ్చ దుస్తులు, గాజులు ధరిస్తారు. దీనికి కారణమేంటో తెలుసుకుందాం.

అసలు శ్రావణమాసానికి, ఆకుపచ్చ రంగుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అంటే.. వర్షాకాలంలో శ్రావణమాసం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి ఆహ్లాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ప్రకృతిలోని పచ్చదనం అనేది మన నూతన జీవితానికి.. సంతానోత్పత్తికి సంకేతంగా చెబుతారు. ఆకుపచ్చ రంగు అనేది వైవాహిక ఆనందానికి సైతం సంకేతంగా చెబుతారు. మహిళలు తమ భర్త సంతోషం, దీర్ఘాయుష్షు, అదృష్టం కోసం ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తారు. అంతేకాకుండా శ్రావణమాసంలో ఆకుపచ్చ బట్టలు, గాజులు ధరించి దేవతను పూజిస్తే అంతులేని అదృష్టం సొంతమవుతుంది.

Share this post with your friends