మాఘ పౌర్ణమి ఎప్పుడు?

మాఘ పౌర్ణమి ఎప్పుడో ముందుగా తెలుసుకుందాం. మాఘపూర్ణిమ, మహా మాఘి ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం. తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీవించే పుణ్యతిథే. ఈ తిథి నాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి.

2026లో మాఘ పౌర్ణమి (మాఘీ పూర్ణిమ) ఎప్పుడో కాదు రేపే. అంటే ఫిబ్రవరి 1వ తేదీ, ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఈ పవిత్రమైన పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఉదయం 5:52 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 2 తెల్లవారుజామున 3:38 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మనం ఏ పండుగనైనా చేసుకుంటాం కాబట్టి ఆదివారం పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది. అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

Share this post with your friends