మహాకుంభమేళాలో ఆరో రాజస్నానం ఎప్పుడు?

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. రోజుకు కోటి మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాకు వస్తున్నారు. మహా కుంభమేళాలో ఆరు రాజస్నానాలని చెప్పుకున్నాం. ఇక చివరి రాజస్నానంతో మహాకుంభమేళా ముగింపునకు చేరకుంటుంది. మరి మహాకుంభమేళా ఎప్పుడో తెలుసుకుందాం.
మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు.. భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి రోజు జరుగనున్నాయి.

ఆరో రాజస్నానం మహా శివరాత్రి నాడు చేయనున్నాం. అంటే ఈ నెల 26వ తేదీన ఆరో రాజస్నానం. ఈ రోజుతో మహాకుంభమేళా ముగియనుంది. ఈ ఆరు రాజస్నానాలను అమృత స్నానాలని పిలుస్తారు. ఆరో రాజస్నానానికి కొన్ని కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు. ఋషులు, సాధువులతో పాటు సాధారణ భక్తులు త్రివేణీ సంగమ ప్రాంతంలో ఆరో, చివరి రాజ స్నానం చేస్తారు. నదీమ తల్లికి నమస్కరించుకుని నది ఒడ్డు నుంచి కొంత మట్టిని సేకరించి నదిలోకి దిగాలి. మట్టిని నీటిలో కలిపిన మీదట మూడు సార్లు నదిలో మునగాలి. అనంతరం దోసిలితో నీటిని తీసుకుని సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం నది నుంచి బయటకు వచ్చి నదిలోకి పసుపు, కుంకుమ వదిలి అరటి దొన్నెలో దీపాలు వదిలి నమస్కరించుకోవాలి.

Share this post with your friends