
హిందూమతంలో ప్రతి ఒక్క రోజుకూ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో వివాహ పంచమి వేడుక జరుగనుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలోని ఐదవ రోజున వివాహ పంచమి వేడుకను నిర్వహిస్తారు. ఈ రోజున సీతారాముల వివాహం జరిగిందని చెబుతారు. అందుకే వివాహ పంచమి వేడుకను శ్రీరామ వివాహ ఉత్సవ వేడుక అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ఈ వివాహ పంచమిని డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ వివాహ పంచమి రోజునే సీతా స్వయంవరం జరిగిందని చెబుతారు.
ఈ వివాహ పంచమి రోజున శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో.. అలాగే సీతా దేవి జన్మస్థలం నేపాల్లోని అలాగే జనక్పూర్లలో రాముని ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు. వివాహం జరిగిన ఐదవ రోజున అరటి చెట్టుకు పూజ చేస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్గశిర మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి డిసెంబర్ 05వ తేదీ మధ్యాహ్నం 12.49 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి డిసెంబర్ 06వ తేదీ మధ్యాహ్నం 12.07 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయతిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి వివాహ పంచమి పండుగ ఈ సంవత్సరం డిసెంబర్ 06 న జరుపుకోనున్నాం.
