కోనేటిరాయ స్వామివారి కల్యాణోత్సవం ఎప్పుడంటే..

చిత్తూరు జిల్లా గంగ‌వ‌రం మండ‌లంలోని కీలప‌ట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమ‌వారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్ర‌తిరోజూ రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. సోమవారం సాయంత్రం పెద్ద శేష వాహనంపై కోనేటి రాయుడు విహరించి భక్తులను కటాక్షించారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

06-05-2025

ఉదయం – చిన్న శేష‌వాహ‌నం

సాయంత్రం – హంస వాహనం

07-05-2025

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

08-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

09-05-2025

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – శ్రీవారి కల్యాణోత్సవం, గరుడ వాహనం

10-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

11-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

12-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

13-05-2025

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends