
హిందువుల జరుపుకునే ప్రధాన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ప్రతి ఏడాది మాఘ మాసంలో అంటే ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి తొలి వారంలో కానీ మహా శివరాత్రి వస్తూ ఉంటుంది. మరి ఈ ఏడాది శివరాత్రి ఎప్పుడు రానుందో తెలుసుకుందాం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న శివరాత్రి రానుంది. మహా శివరాత్రి నాడు శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ రోజున శివుడిని ఆరాధించి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసం, జాగరణ చేస్తే చాలా మంచిదని భావిస్తారు. అయితే చాలా మందికి మహా శివరాత్రికి, మాస శివరాత్రికి మధ్య తేడా తెలియదు. అదేంటో తెలుసుకుందాం.
శివరాత్రిని మొత్తం ఐదు రకాలుగా విభజించారు. ఈ ఐదు సమయాల్లోనూ తప్పనిసరిగా శివారాధన చేస్తాం. మొదటిది నిత్య శివరాత్రి. రెండవది ప్రతి నెలలో శుక్ల బహుళపక్షాల వేళ చతుర్దశి ఉన్నప్పుడు జరుపుకుంటాం. మూడవది ప్రతీ నెలా బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటాం. నాలుగవది మాఘ మాసంలో అంటే ఈ నెలలో మహా శివరాత్రి జరుపుకుంటాం. ఐదవది యోగులు, యోగ సమాధిలో ఉన్న శివుడిని ఆరాధించి ఉపవాసం ఉంటారు. ప్రతి నెలలోనూ మనం మాస శివరాత్రిని జరుపుకుంటాం. ఈ రోజున ఉపవాసం ఉంటూ శివుడిని పూజిస్తాం. మాస శివరాత్రి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. మాస శివరాత్రిని ప్రతి నెలా జరుపుకుంటాం. మహా శివరాత్రిని ఏడాదికోసారి మాత్రమే నిర్వహిస్తాం.
