హనుమాన్ జయంతి ఎప్పుడు?

హిందూ సంస్కృతిలో ప్రతి పండుగకూ విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే మనం రెండు పండుగలను జరుపుకున్నాం. ఇక ఈ రెండు పండుగల తర్వాత హనుమాన్ జయంతి రానుంది. ప్రతి ఏటా చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. కాబట్టి మనం ఆరోజున హనుమాన్ జయంతి పండుగను జరుపుకుంటాం. మరి ఈ ఏడాది హనుమ జయంతి ఎప్పుడు? ఏ వారం రానుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 12 శనివారం నాడు హనుమాన్ జయంతి రానుంది.

పౌర్ణమి తిథి ఏప్రిల్ 12, 2025 తెల్లవారుజామున 3:21 గంటలకు ప్రారంభమై మరునాడు అంటే ఏప్రిల్ 13, 2025 ఉదయం 5:51 గంటలకు ముగియనుంది. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడని చెబుతారు. కాబట్టి హనుమ జయంతిని 12వ తేదీనాడు జరుపుకోనున్నాం. అంజనాదేవి, కేసరి కుమారుడే ఆంజనేయుడు. హనుమంతుడు అంటే మరణం లేనివాడని.. శాశ్వతంగా జీవించేవాడని అర్థమట. పురాణాల ప్రకారం అష్టాదశ చిరంజీవులు ఉన్నారు. వారిలో హనుమంతుడు ఒకడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పటికీ హనుమంతుడు భూమిపై సంచరిస్తూ భక్తులను కాపాడుతుంటాడని నమ్మకం. అందుకే హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట.

Share this post with your friends