ముక్తేశ్వర క్షేత్రంలో 3 రోజుల పాటు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారంటే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో నేడు మహాకుంభాభిషేకం ప్రారంభమైంది. ఇది మూడు రోజుల పాటు జరుగనుంది. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం మంగళ వాయిద్యాలతో పేద స్వస్తి వాచకములు, గణపతి పూజ, గోపూజ, పున్నవచనము, రక్షాబంధనం, పంచగవ్యపాషణం, అఖండ జ్యోతి ప్రజ్వలన, యాగశాల ప్రవేశంతో మహా కుంభాభిషేకానికి అంకురార్పణ జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు దేవతాస్థాపన పూజలు హోమాలు, చండీ పారాయణం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించనున్నారు.

శనివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రాతఃసూక్త మంత్ర పఠనం, ప్రాతఃకాల పూజలు, చండీ పారాయణం, మహా రుద్రాభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం మూడున్నర నుంచి సాయంత్రం 6:30 వరకు హారతి మంత్రపుష్పం, చతుర్వేదసేవలు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తారు. చివరి రోజైన 9వ తేదీ ఆదివారం ఉదయం అసలు ఘట్టం ఉంటుంది. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు ప్రాతఃకాల పూజలు రుద్ర వాహనం, జయాధులు బలి ప్రధానం, మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నలభై రెండు నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి ఆశీర్వచనం నిర్వహిస్తారు. ఉదయం 10:42 గంటలకు కుంభాభిషేకంలో భాగంగా పీఠాధిపతులు, వేద పండితులు ప్రధాన దేవా అర్చకులు మెట్ల ద్వారా పైకి వెళ్లి ఆలయానికి చెందిన నాలుగు గోపురాలను శుద్ధికరణ చేస్తారు.

Share this post with your friends