న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలేంటంటే..

న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంటే మే 19వ తేదీ వరకు అత్యంత వైభ‌వంగా జరుగనున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం వాహన సేవలు నిర్వహించనున్నారని తెలిసిందే. మరి ఏ రోజున ఏ ఏ సేవలు నిర్వహిస్తారో తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

11-05-2025 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్ద‌శేష వాహనం.

12-05-2025 ఉదయం – చిన్న‌శేష వాహ‌నం, రాత్రి – హంస వాహనం.

13-05-2025 ఉదయం – సింహ వాహ‌నం, రాత్రి – ముత్య‌పు పందిరి వాహ‌నం.

14-05-2025 ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి – స‌ర్వ‌భూపాల వాహనం.

15-05-2025 ఉదయం – మోహినీ అవ‌తారం, సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం, రాత్రి – గ‌రుడ వాహ‌నం.

16-05-2025 ఉదయం – హ‌నుమంత వాహ‌నం, రాత్రి – గజవాహనం.

17-05-2025 ఉదయం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం.

18-05-2025 ఉదయం – ర‌థోత్స‌వం, రాత్రి – అశ్వ వాహ‌నం.

19-05-2025 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.

Share this post with your friends