అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం.. హాజరైన ఈవో దంపతులు

అయోధ్యలో శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగంలో తిరుమల తరిుపతి దేవస్థానం ఈవో జె. శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ యాగం గత నవంబర్ 18 నుండి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాగం జనవరి 1వ తేది నాటికి పూర్తవుతుంది.

కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేద విద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్‌కు సూచించారు.

రుమలలోని లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Share this post with your friends