ఆ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు వెరీ వెరీ స్పెషల్.. అవేంటో తెలిస్తే..

వేరే దేవుళ్ల విషయానికి వస్తే ఏమైనా ఆలోచిస్తారేమో కానీ వినాయకుడి విషయంలో మాత్రం కులమతాలకతీతంగా అంతా ఏకమవుతారు. దీనికి నిదర్శనమే.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కేశవాపురం గ్రామం. ఈ గ్రామంలో ఎవ్వరూ కూడా వినాయకుడి విషయంలో కులమతాలను పట్టించుకోరు. ఊరు ఊరంతా కదలి వచ్చి మరీ వేడుకల్లో పాల్గొంటుంది. ఊరిలో వీధికో వినాయకుడు ఉండడు. ఊరంతా కలిపి ఒక్కచోటే వినాయకుడిని పెట్టుకుంటారు. గ్రామంలో కొన్నేళ్లుగా రామాలయం వద్ద గణపతి విగ్రహాన్ని పెట్టి నవరాత్రులు పూజలు చేస్తారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ పూజల్లో పాల్గొంటారు.

వాస్తవానికి ఈ గ్రామం గతంలో కన్నెకల్‌ గ్రామ పరిధిలోని ఆవాస గ్రామంగా ఉండే ఈ గ్రామం ఐదేళ్ల క్రితం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి మెలిసి వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఇక వినాయకుడి విగ్రహ ఏర్పాటుకైతే రాజకీయ నేతలుపోటీ పడి విగ్రహాలు, విరాళాలతో ఇస్తామంటూ ముందుకు వస్తే.. గ్రామస్తులు సున్నితంగా తిరస్కరించారు. వినాయక చవితికి ముందే గణేష్ కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ ప్రకారమే అంతా నడుస్తుంది. ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. గణేష్ మండపాల వద్ద మాదిరిగా డీజే చప్పుళ్లు, డాన్స్ ప్రోగ్రామ్ లు ఇక్కడ ఉండవు. భజనలు, కోలాటాలుంటాయి. పర్యావరణ హితంగా 10 రోజుల పాటు ఉత్సవం కొనసాగుతుంది.

Share this post with your friends