రూ. కోట్ల కరెన్సీ నడుమ మెరిసిపోయిన వాసవీ మాత

నవరాత్రుల సందర్భంగా దేశంలోని అమ్మవారి ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో మహాలక్ష్మీ రూపంలో అమ్మవారిని కోట్ల రూపాయలతో అలంకరిస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని అమలాపురంలో శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ అద్భుతంగా జరిగింది. రన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు ఒక విశేషమైన అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న వాసవీ అమ్మవారు.. తాజాగా కరెన్సీ నోట్ల అలంకరణ మధ్య మెరిసిపోయారు.

అమ్మవారిని ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కోట్ల 33 లక్షల రూపాయలతో అమ్మవారిని ఆలయ నిర్వాహకులు అలంకరించారు. అమ్మవారి ముఖ మండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తాన్ని కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణ నడుమ మహాలక్ష్మీ దేవి ధగధగ మెరిసిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ ఆలయ నిర్వహకులు అమ్మవారిని ఇలా అలంకరించడం తొలిసారేమీ కాదు.. కొన్నేళ్లుగా జరుగుతోంది.

Share this post with your friends