తిరుచానూరులో భక్తుల కోలాహలం నడుమ ఉట్లోత్సవం..

తిరుమల అనుబంధ ఆలయాలన్నింటిలోనూ ఉట్లోత్సవం నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలిరోజు అంటే ఈ నెల 27న ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం రాత్రి 7 గంట‌లకు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఇక నిన్న సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం నడుమ ఉట్లోత్సవం నిర్వహించారు. ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీక ష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు జరిగింది. రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కూ ఉట్లోత్సవం, ఆస్థానం ఘనంగా నిర్వహించారు. అలాగే నారాయణవనం నిన్న ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వహిచారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

Share this post with your friends