టీటీడీకి రెండు ద్విచక్ర వాహనాలు విరాళం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చిన వారంతా స్వామివారికి తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం శ్రీవారికి ఖరీదైన రెండు బైక్‌లు కానుకగా వచ్చాయి. తిరుమల శ్రీవారికి మంగళవారం చెన్నైకి చెందిన టీవీఎస్, బెంగళూరుకు చెందిన ఎన్‌డీఎస్ ఎకో సంస్థలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించాయి. ఆయా సంస్థల ప్రతినిధులు టీటీడీ అధికారులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.

టీవీఎస్ ఐ క్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు, ఎన్‌డీఎస్ ఎకో వాహనం ధర రూ.1.56 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆయా సంస్థల ప్రతినిధులు అందజేశారు. ముందుగా ఆలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైక్ తాళాలను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఏఈవో వారిని అభినందించారు.

Share this post with your friends