అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయంపై స్పందించిన టీటీడీ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఏదో ఒక అపచారం జరిగిందంటూ వార్తలు వినవస్తూనే ఉన్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం స్పందిస్తూనే ఉంది. తాజాగా మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు ఆరోపణ చేశాడు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. జెర్రీ పడిందంటూ భక్తుడు చేస్తున్న ఆరోపణ సత్యదూరమని తేల్చింది.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ వారు అన్నప్రసాదాలను తయారు చేస్తారు.అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరం. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే అని భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Share this post with your friends