టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కి భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కి ఒక వ్యక్తి భారీ విరాళం అందజేశారు. ముంబైకి చెందిన భక్తుడు శ్రీ తుషార్ కుమార్ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు సోమవారం రూ.11 కోట్లు భారీ విరాళం అందించారు. ముంబైకి చెందిన దాత సదరు డిడిని తిరుమలలోని అదనపు ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాత శ్రీ తుషార్ కుమార్ ను అదనపు ఈవో అభినందించారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తుషార్ కుమార్ దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకోగానే ఆలయం డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తీర్థ ప్రసాదాలను అందించారు. మహారాష్ట్ర సీఎం వెంట తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ సౌరభ్ హెచ్.బోరా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this post with your friends