TTD Latest Big Update : ఇకనుంచి ప్రతీరోజూ అందుబాటులోకి శ్రీవారి శ్రీవాణి టికెట్లు… అదేరోజు దర్శనం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక గమనిక విడుదల చేసింది. భక్తుల సౌకర్యం, పరిపాలనా అవసరాల దృష్ట్యా తిరుమలలో ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 9 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ విధానంలో టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆధార్ ధృవీకరణతో పాటు మొబైల్ నంబర్ తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మార్పులు నెలరోజులు పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా శ్రీవారి దర్శనం మరింత సులభంగా, సవ్యంగా సాగుతుందని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది.

TTD Latest Big Update
TTD Latest Big Update
Share this post with your friends