శ్రీ మలయప్ప స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలన్నీ ఒక ఎత్తు.. శ్రీవారి గరుడ సేవ ఒక ఎత్తు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనికి భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరవుతారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు గొడుగుల ఊరేగింపు చేరుకుంటుంది. దీని విషయంలోనే టీటీడీ భక్తులకు కీలక సూచన చేసింది.
గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొస్తాయి. అనంతరం స్వామివారికి గొడుగులను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.