మహా కుంభమేళాలో సేవలందిస్తున్న ఉద్యోగులకు టీటీడీ ఛైర్మన్ ధన్యవాదాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్ వద్ద జనవరి 23 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ప్రతిష్టాత్మకంగా మహా కుంభమేళా జరుగుతోంది. ఈ కుంభమేళాకు నిత్యం కోట్లలో భక్తులు హాజరై పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తన వంతుగా సాయం అందిస్తోంది. నమూన శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. టీటీడీ తరుపున శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న టీటీడీ అర్చకులు, అధికారులు, సిబ్బందికి టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పాలకమండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

టీటీడీ బోర్డు మీటింగ్ తాజాగా జరిగింది. ఈ బోర్డు మీటింగ్ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మహా కుంభమేళలో దాదాపు 250 మందికి పైగా టీటీడీ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకు సరాసరి పది వేలకు పైగా శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కైంకర్యాలను, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని, ప్రయాగ రాజ్‌లో భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు. తిరుమలలో సేవలందిస్తున్న వారందరికీ టీటీడీ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.

Share this post with your friends