అయోధ్య రాముడికి టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పణ

అయోధ్య శ్రీ రాముడిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. బాల రామయ్యకు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు శ్రీరామ జన్మ భుమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్ళి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అయోధ్యలో శ్రీ శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీఆర్ నాయుడు దంపతులు హాజరయ్యారు. సరయూ నది ఒడ్డున కన్నుల పండువగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం అయోధ్య రామయ్యను బీఆర్ నాయుడు దంపతులు దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ముఖ్య అర్చకులు శ్రీ గోపీనాథ్ దీక్షితులు, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends