తిరుమలలో అన్నప్రసాదాలు, లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసిన టీటీడీ ఛైర్మన్

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, లడ్డూ కౌంటర్లను మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ముందుగా ఆయన శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనాన్ని తనిఖీ చేసి, వంటల తయారీ, వంట సామాగ్రి నిల్వ మరియు శుభ్రతను పరిశీలించారు. అనంతరం భక్తులతో ఆయన ముచ్చటించి వారికి వడ్డిస్తున్న అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అన్నప్రసాదం నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు అపారమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని ఆహార పదార్థాలు బాగున్నాయని పేర్కొన్నారు. అనంతరం లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి క్యూ లైన్లను, లడ్డూల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. లడ్డూల నాణ్యత, పరిమాణం, రుచిపై భక్తుల నుంచి అభిప్రాయాలను కనుక్కొన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends