పలమనేరులోని టిటిడి గోశాలలో టీటీడీ ఛైర్మెన్ ఆకస్మిక పరిశీలన

పలమనేరులోని తిరుమల తిరుపతి గోస్థానం గోశాలలో టీటీడీ ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు బుధవారం ఆకస్మిక పరిశీలన చేపట్టారు. పలమనేరులో 450 ఎకరాలలో టీటీడీ స్వదేశీ గో సంవర్థ సంస్థ 500 గోవులతో గోశాల నడుస్తోంది. గోవుల సంరక్షణ సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్రంగా పరిసరాలు ఉండడంపై టీటీడీ ఛైర్మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల రోజువారి నిర్వహణపై వారం రోజులలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోశాలలోని గోవులకు టీటీడీ ఛైర్మెన్ పశుగ్రాసం పెట్టారు. గోవులకు అందిస్తున్న దాణా, తాగునీరు, వైద్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు సైతం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. అంటే దేశ వ్యాప్తంగా ఇవాళే హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇవాళ టీటీడీ సైతం అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనుంది.

Share this post with your friends