
ఈ నెల 9 వ తారీకు శనివారం రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన రోజు. శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి, శనివారం, శ్రవణా నక్షత్రం, చాలా అద్భుతమైన పర్వదినం. ఈ విధంగా అన్ని ఒకే రోజు రావడం చాలా విశేషం. కాబట్టి ఆరోజున ప్రతి ఒక్కరూ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శించుకుంటే మంచిది. ఆ రోజు ప్రతి ఒక్కరు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి మాలను సమర్పించండి లేదా కనీసం తులసీదళాన్ని భక్తితో స్వామికి సమర్పించారు.
‘ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ’ నామాలను స్మరిస్తూ స్వామి దర్శనం చేసుకోండి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోలేని వారు మీరు ఎక్కడ ఉన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని తలుచుకుని పై నామాలను స్మరణ చేసుకోండి. అఖిలాండకోటి బ్రహ్మాండాన్ని అంతటినీ సంరక్షించే మన వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం రోజున అందరూ భక్తిశ్రద్ధలతో దర్శించుకోవాలి. అలా చేస్తే మనం ఏం కోరుకున్నా శ్రీనివాసుడు తీరుస్తాడని నమ్మకం.
