ఇవాళ శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 22వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వ‌హించారు. అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఎస్వీ ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు..

అమరావతి (వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహించారు. అనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. యంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, రుత్వికులకు బహుమానం, పవిత్రోత్సవాలు ముగిశాయి.

Share this post with your friends