ఇవాళ అంతర్వేది శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారి కల్యాణం

నవ నారసింహ క్షేత్రాల గురించి వినే ఉంటారు. వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా స్వామివారు కొలువుదీరారు. తొమ్మిది రోజుల పాటు దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మాఘ మాసంలో రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకూ తిరు కల్యాణ మహోత్సవాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఈ ఉత్సవాల సందర్భంగా అంతర్వేది భక్తజన సంద్రంగా మారుతోంది. ఈ సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం.

మాఘమాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. ఈ మాసం సూర్యభగవానునికి అత్యంత ప్రీతికరమైనది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని చెబుతారు. కలియుగంలో కనిపించే దేవుడు సూర్య భగవానుడిని నిత్యం పూజిస్తారు. అంతర్వేదిలో తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా మాఘ శుద్ధ దశమి నాడు అంటే నేటి రాత్రి మృగశిరా నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నంలో నరసింహ స్వామి వారి కల్యాణం.. అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరి 2, మాఘ బహుళ పాడ్యమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. స్వామివారి కల్యాణోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.

Share this post with your friends