
సంకష్ట హర చతుర్ధిని దేశమంతా అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. హిందువులు అత్యంత వైభవంగా దీనిని జరుపుకుంటాం. అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కఏడాది అయినా ఆచరిస్తే చాలు మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం. పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం రోజులో కాసేపు గణపతి ధ్యానం/జపంలో గడిపి… చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి.
గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నారు. దీనిలో భాగంగా ఉండవలిసిన వారు.. పగలంతా ఉపవాసం ఉంటారు. ఉండలేనివారు అల్పాహారంతో గానీ గడిపేస్తారు. ఈ సంకష్టహర చతుర్తిని అత్యంత నిష్ఠతో నిర్వహిస్తారు. సాయంత్రమవగానే స్నానం చేసి.. మట్టితో గణేశుని ప్రతిమ చేసి గానీ, పసుపుతో మూర్తిని చేసి గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి. మూడు, ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను సమర్పించాలి. ఇరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి. కొంతసేపు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించి.. చంద్రుడిని చూసి.. చతుర్థి తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
