నేడు మత్స్య జయంతి.. విధివిధానాలేంటంటే..

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు. బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’ అని అంటారు.

మత్స్య జయంతి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు. కావున ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం , హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ , ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.

Share this post with your friends