ఇవాళ భౌమ ప్రదోష.. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే..

పరమ శివుని పూజలో ప్రదోషకు అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అసలు ప్రదోష అంటే ఏమిటి? భౌమ ప్రదోష విశిష్టతతో పాటు ప్రదోష పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. అసలు ప్రదోష సమయం ఏంటో ముందుగా తెలుసుకుందాం. సూర్యాస్తమయం తరువాత 2 గంటల 24 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలంగా భావిస్తారు. ఇక ప్రదోషం పేరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. వారం, తిథిని బట్టి మారుతూ ఉంటుంది. నిత్యం అంటే ప్రతి రోజూ వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా పిలుస్తారు.

త్రయోదశి నాడు వచ్చే ప్రదోషం చాలా ముఖ్యం. దీనిని మహా ప్రదోషంగా పిలుస్తారు. నెలలో రెండు త్రయోదశిలు వస్తాయి. వాటిలో ఒకటి.. శుక్ల పక్ష త్రయోదశి కాగా.. రెండవది కృష్ణ పక్ష త్రయోదశి. అలాగే ఇవాళ త్రయోదశి. మంగళవారం వచ్చింది కాబట్టి తెలుగు పంచాంగం ప్రకారం.. మంగళవారం వచ్చిన త్రయోదశిని భౌమ ప్రదోషంగా పిలుస్తాం. ఈ రోజున శివపార్వతులను పూజించుకుంటారు. ఇలా చేయడం వలన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని శివపురాణం, లింగపురాణాలలో వివరించడం జరిగింది. శివుడి ఆరాధనకు ప్రదోషమనేది అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు.

Share this post with your friends