
ఈ రోజు దూర్వా త్రిరాత్రి వ్రతం. భాద్రపద శుక్ల పక్ష త్రయోదశి నుంచి భాద్రపద పూర్ణిమ వరకూ ఈ వ్రతం ఆచరిస్తారు. పద్మ పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని పుత్ర ప్రాప్తి వ్రతం అని కూడా పిలుస్తారు. మొదటి రోజు దంపతులు శివుడుని, ఉమాదేవిని గరికతో పూజించి హోమం చేస్తారు. రెండవ రోజు దంపతులు యమధర్మరాజుని, పూర్ణిమ రోజు దంపతులు ఉపవాసం ఉండి, ఉమా మహేశ్వరులను, యమధర్మరాజుని, సావిత్రీదేవిని పూజిస్తారు.
దుర్వా త్రిరాత్రి వ్రతం ఆచరించడం వలన అనంతమైన ఆనందం, సంపద,ఆరోగ్యం చేకూరుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం.
ఈరోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్నందువలన, ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతం. శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి, ప్రదోష సమయం లో దీపారాధన చేసి, రుద్రాభిషేకం చేస్తారు. గురువారం రోజు ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్నప్పుడు గురు ప్రదోషం అని పిలుస్తారు.
