ఈ వినాయకుడి ఆలయం.. ఎన్ని మిరాకిల్స్‌కి నెలవో తెలిస్తే..

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో శ్రీ మహాదేవ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడి వినాయకుడు ఆరు నెలల కోసారి రంగులు మారుస్తాడని చెప్పుకున్నాం. అంతేకాదు.. ఇలా రంగు మారే ఈ అద్భుత వినాయకుడిని చూస్తే మన జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు చెబుతారు. ఇక్కడి వినాయకుడు మాత్రమే కాదు.. ఇక్కడి బావి నీరు కూడా అద్భుతమే. గణేశుడి మాదిరిగానే ఇక్కడి బావిలోని నీరు సైతం రంగులు మార్చుకుంటూ ఉంటుంది. అయితే వినాయకుడి రంగుకు కాంట్రాస్ట్‌గా బావి నీరు మారుతుంది.

వినాయకుడు తెల్లగా ఉంటే బావి నీరు నల్లగానూ.. వినాయకుడు నల్లగా ఉంటే బావి నీరు తెల్లగా మారుతుందట. గణపతి, బావి నీరు మాత్రమే కాకుండా ఇక్కడి విశేషం మరొకటి కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా శిశిర ఋతువులో మాత్రమే చెట్ల ఆకులు రాలుతాయి. ఇది ప్రకృతి నియమం. ఈ ఆలయంలో మాత్రం అలా జరగదు. ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. ఈ ఆలయంలో ఇన్ని మిరాకిల్స్ ఉన్నాయి కాబట్టే దీనిని భక్తులు మిరాకిల్‌ వినాయకర్‌ ఆలయం అని కూడా పిలుస్తారు.

Share this post with your friends