ఈ వినాయకుడు వెరీ స్పెషల్.. ఎలా రంగులు మారుస్తాడంటే..

వినాయకచవితి త్వరలోనే రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ విఘ్నేశ్వరుడి ఆలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో శ్రీ మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయంలో గణేశుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి గణేశుడి ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాకవుతారు. అదేంటంటే.. ఈ వినాయకుడు ప్రతి ఆరు నెలలకోసారి తన రంగును మార్పుకుంటూ ఉంటాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఏడాదిలోని తొలి ఆరు నెలలు ఒక రంగులోనూ.. తరువాతి ఆరు నెలలూ మరో రంగులోనూ ఉంటాడు.

ఇక ఈ వినాయక విగ్రహం ఈనాటిది కాదు.. 2300 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ వినాయకుడు తమిళ క్యాలెండర్ ప్రకారం తై మాసం నుంచి ఉత్తరాయణ కాలం అయిన ఆణి వరకూ అంటే మార్చి నుంచి జూన్ వరకూ వినాయకుడు నలుపు రంగులో దర్శనమిస్తాడు. ఆ తరువాత ఆషాడం నుంచి మార్గశిర మాసం వరకూ అంటూ జూలై నుంచి ఫిబ్రవరి వరకూ గణపతి తెలుపు రంగులో దర్శనమిస్తాడు. ఆ తరువాత ఉత్తరాయణ కాలం ప్రారంభమైనప్పుడు వినాయకుడిపై విచిత్రంగా నల్ల చుక్కలు రావడం ప్రారంభమై క్రమంగా నల్లగా మారుతాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం అనేది వినాయకుడి మహత్యమని అక్కడి వారు చెబుతారు.

Share this post with your friends