శ్రావణమాసంలో వచ్చే పండుగలు ఇవే..

శ్రావణమాసం రాబోతోంది. తెలుగు పంచాంగం ప్రకారం ఇది ఐదవది అయినా కూడా ఆధ్యాత్మిక పరంగా తొలి స్థానంలో ఉంటుంది. ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ మాసాన్ని బాగా ఇష్టపడతారు. ఏడాదంతా ఈ మాసం కోసమే ఎదురు చూస్తారు. ఈ మాసంలో వ్రతాలు, నోములు నోచుకుంటారు. అంతేకాదు.. ఈ నెలలో గుళ్లు సైతం భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక శ్రావణమాసంలో శుభకార్యాలు సైతం పెద్ద ఎత్తున జరుగుతాయి. శ్రావణమాసం జులై 25 శుక్రవారం ప్రారంభమై ఆగస్ట్ 23తో ముగియనుంది. ఇక ఈసారి శ్రావణమాసంలో చాలా పండుగలు, పుణ్యతిథులు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

జులై 25 శ్రావణ శుద్ధ పాడ్యమి: శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం ఆరంభం
జులై 26 శ్రావణ శుద్ధ విదియ: శనివారం, చంద్రోదయం
జులై 28 శ్రావణ శుద్ధ చవితి: నాగ చతుర్థి, ఆండాళ్ తిరు నక్షత్రం ఆదిపూరం, వాల్మీక పూజ, దుర్వార గణపతి వ్రతం.
జులై 29 శ్రావణ శుద్ధ పంచమి: నాగ పంచమి, శ్రావణ మంగళ గౌరీ వ్రతం, తిరుమల శ్రీవారి గరుడ సేవ
జులై 30 శ్రావణ శుద్ధ షష్టి: సూపౌదన వ్రతం, కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి, సూర్య షష్టి వ్రతం
ఆగష్టు 1 శ్రావణ శుద్ధ అష్టమి: నరసింహ వ్రతం, శ్రావణ మాసం రెండో శుక్రవారం
ఆగష్టు 2 శ్రావణ శుద్ధ నవమి: కౌమార నవమి, తరిగొండ వెంగమాంబ వర్ధంతి
ఆగష్టు 3 శ్రావణ శుద్ధ నవమి/దశమి: ఆశ్లేష కార్తె ప్రారంభం
ఆగష్టు 5 శ్రావణ శుద్ధ ఏకాదశి: సర్వేషాం మతత్రయ ఏకాదశి, పుత్రదా ఏకాదశి
ఆగష్టు 6 శ్రావణ శుద్ధ ద్వాదశి: దామోదర ద్వాదశి
ఆగష్టు 8 శ్రావణ శుద్ధ చతుర్దశి: వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి
ఆగష్టు 9 శ్రావణ శుద్ధ పౌర్ణమి: రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, తిరుమల శ్రీవారి తిరు నక్షత్రం, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి.
ఆగష్టు 11 శ్రావణ బహుళ విదియ: రాఘవేంద్ర ఆరాధన
ఆగష్టు 12 శ్రావణ బహుళ చవితి: సంకష్ట హర చతుర్థి
ఆగష్టు 15 శ్రావణ బహుళ సప్తమి: భారత స్వాతంత్య్ర దినోత్సవం, అరవింద యోగి జయంతి
ఆగష్టు 16 శ్రావణ బహుళ అష్టమి: శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగష్టు 17 శ్రావణ బహుళ నవమి: సింహ సంక్రమణం
ఆగష్టు 19 శ్రావణ బహుళ ఏకాదశి: కామిక ఏకాదశి, అజా ఏకాదశి
ఆగష్టు 21 శ్రావణ బహుళ త్రయోదశి/చతుర్దశి: మాస శివరాత్రి
ఆగస్టు 23 శ్రావణ బహుళ అమావాస్య: పోలాల అమావాస్య

Share this post with your friends