కొత్తకోడలు ఇంటికి వచ్చినపుదు సారె పంచడం ఆనవాయితీ. శక్తి మేరకు సారెను పంచడం ఆనవాయితీ. ఇలా సారె పంచితే మంచిదని చెబుతారు. దేవాలయాలకు సైతం ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ప్రముఖ దేవాలయాలకు మరో దేవాలయం నుంచి సారెను తీసుకెళుతుందటారు. విజయవాడ దుర్గ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన ద్వారకతిరుమల, అన్నవరం, కాణిపాకం తదితర అలయాల నుంచి పెద్ద ఎత్తున సారె దుర్గమ్మకు చేరుకుంది. ఇక రాష్ట్రంలోని మరో అమ్మవారికి అయితే ఆశ్చర్యకరంగా 1500 కేజీల స్వీట్స్‌ను సారెగా సమర్పించారు.
అమ్మవారికి అరకేజీ బంగారంతో కిరీటాన్ని తయారు చేయించి అలంకరించారు. ఆ అమ్మవారు మరెక్కడో లేదు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో కొలువై ఉంది. ఈ అమ్మవారికి ఇలా దాదాపు టన్నున్నర బరువైన స్వీట్లను సారెగా సమర్పించారు. టన్నున్నర బరువైన 11 రకాల స్వీట్లను అమ్మవారికి సమర్పించారు. ఇదంతా మరెవరో కాదు.. ఆ గ్రామస్తులే ఇలా సారెను సమర్పించారు. ఉత్సవాల్లో ఆరవ రోజు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిలో భాగంగానే కోట్ల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. అనంతరం మహిళలతో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు.