కొన్ని కొన్ని మండపాలకు నిర్వాహకుల క్రియేటివిటీకి అద్దం పడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ మండపమే చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. అక్కడికి వెళ్లిన వారిని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. చూసిన వారంతా వాహ్ ఏం థీమ్ అని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. అదేంటంటే.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ సన్నివేశం థీమ్. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూస్తున్నవారికైతే గూస్‌బంప్స్ వచ్చాయి. అంత రసవత్తరంగా జరిగిందా మ్యాచ్. మొత్తానికి ఇండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో సఫరా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ చేయడంతో ఒక్కసారిగా క్రికెట్ లవర్స్ రిలాక్స్ అయిపోయింది. ఈ క్యాచే ఆటను టర్న్ చేసి.. భారత్‌ను టీ20 వరల్డ్ కప్ విన్నర్‌ని చేసింది. సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్న క్యాచ్‌పై ప్రశంసలు అయితే వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ క్యాచ్‌ను బేస్ చేసుకునే గుజరాత్‌లో ఓ సెట్ వేశారు. గుజరాత్‌లోని వాపిలో క్రికెట్ లవర్స్ అంతా కలిసి గణేష్ మండప ఏర్పాటు చేయాలనుకున్నారు. థీమ్ కోసం పెద్దగా సెర్చ్ చేయకుండానే వారి మైండ్‌కు టచ్ అయ్యింది. అంతే వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ సన్నివేశం థీమ్‌తో గణేష్ మండపాన్ని రూపొందించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు.