
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఫిబ్రవరి 04వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
08-02-2026
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 6.05 గంటలకు – మకర లగ్నం),
పల్లకీ సేవ (ఉదయం 7 నుండి 9 గంటల వరకు)
రాత్రి – హంస వాహనం
09-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
10-02-2026
ఉదయం – భూత వాహనం
రాత్రి – సింహ వాహనం
11-02-2026
ఉదయం – మకర వాహనం
రాత్రి – శేష వాహనం
12-02-2026
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – అధికారనంది వాహనం
13-02-2026
ఉదయం – వ్యాఘ్ర వాహనం
రాత్రి – గజ వాహనం
14-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – అశ్వ వాహనం
15-02-2026
ఉదయం – రథోత్సవం (భోగితేరు)
రాత్రి – నందివాహనం
16-02-2026
ఉదయం – పురుషామృగవాహనం (ఉదయం 8 నుండి 10 గంటల వరకు)
సాయంత్రం – శివపార్వతుల కల్యాణోత్సవం (సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు)
రాత్రి – తిరుచ్చి ఉత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు)
17-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనంపై నటరాజస్వామివారు (ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు),
త్రిశూలస్నానం (ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు)
సాయంత్రం – ధ్వజావరోహణం (సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు),
రాత్రి – రావణాసుర వాహనం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు)
