నవదుర్గలు.. ఆధ్యాత్మిక విశిష్టతలు ఏంటంటే..

1. శైలపుత్రి:- ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే ”శైలపుత్రి”.

2. బ్రహ్మచారిణి:- నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో), మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే “బ్రహ్మచారిణి” తత్వం.

3. చంద్రఘంట:- ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి ‘త్రినేత్ర దృష్టి’ ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే “చంద్రఘంట”.

4. కూష్మాండ:- విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే “కూష్మాండ”.

5. స్కంద మాత:- సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే “స్కందమాత”.

6. కాత్యాయని:- తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే “కాత్యాయని”.

7. కాళరాత్రి:- ప్రతి అంతం… ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే “కాళరాత్రి”.

8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే “మహాగౌరీ”.

9. సిద్దిధాత్రి:- ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే “సిద్ధిధాత్రి”.

Share this post with your friends