తెల్లవారుజామునే బాబా మహాకాళుడికి రాఖీ కట్టిన పూజారి కుటుంబం

దేశమంతా రాఖీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. కొన్ని ఆలయాల్లో దేవతలకు రాఖీ కడతారు. ఇప్పటికే బడా గణేశుడి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో ఆలయం గురించి తెలుసుకుందాం. అది కూడా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనే ఉంది. ఇక్కడ కొలువైన బాబా మహాకాళుడికి ఆలయ పూజారి కుటుంబంలోని మహిళలు రాఖీ కడతారు. ముందుగా పూజారి కుటుంబ మహిళలు భస్మ హారతి సమర్పించారు. అనంతరం బాబా మహాకాళుడికి రాఖీ కట్టి 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించింది.

ఈ ప్రసాదాన్ని ఉదయం నుంచే ఆలయానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడం ఆరంభించారు. ఇది ఈ ఏడు జరిగిన తంతు కాదు. ప్రతి ఏటా ఈ విధంగా ఇక్కడి మహాకాళుడికి పూజారి కుటుంబం రాఖీ కట్టి 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని కూడా సమర్పిస్తారు. ఇవాళ తెల్లవారుజామున ముందుగా బాబా మహాకాళుడికి జలాభిషేకం చేసి అనంతరం 3 గంటలకు భస్మ హారతి ఇచ్చారు. అనంతరం పంచామృతంతో అభిషేకించి బాబా మహాకాళుడిని అందంగా అలంకరించారు. ఈ అలంకరణ తర్వాత పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు బాబా మహాకాళుడికి రాఖీ కట్టారు. రాఖీ వేడుక తొలుత మహాకాళుడికే జరుగుతుంది. మంత్రాలు జపిస్తూ పూజారి కుటుంబం లవంగాలు, యాలకులు, తులసి దళాలు, బిల్వ పత్ర వేర్లతో తయారు చేస్తారు.

Share this post with your friends